Why NTR 30 Trending in Twitter: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ ఆ సినిమా చేయకుండా కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలమైనా సరే ఇంకా కొరటాల శివ సినిమా ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నాళ్ల క్రితం కొరటాల శివ చేత అనేకసార్లు ఎన్టీఆర్  స్క్రిప్ట్ మార్పించారని ఎట్టకేలకు స్క్రిప్ట్ ఫైనల్ అయిందని మరికొద్ది రోజుల్లో షూటింగ్ జరగబోతుందని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఏమో అనే అనుమానాలు వ్యక్తమవడంతో సినిమా పిఆర్ టీమ్ స్పందించింది.


డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ప్రొడక్షన్ పని మొదలుపెట్టారని పెద్ద ఎత్తున ఈ పని జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాక ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఫేమ్ సాబు సిరిల్ సినిమాలో భాగం అవుతున్నట్టు ప్రకటించారు. అంతేకాక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 12వ తేదీన జరగనున్నాయని అంటున్నారు. ఆ వెంటనే ఈ సినిమా సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ తన పని మొదలు పెట్టబోతున్నాడు అని తెలుస్తోంది. 
Also Read: Movies Releasing in Theaters: ఈ వారం థియేటర్లలో ఏకంగా 11 సినిమాలు.. ఓటీటీలో ఏమేం సినిమాలు వస్తున్నాయంటే?


Also Read: Chiranjeevi Dominates Balakrishna: మాట నెగ్గించుకున్న చిరు.. బాలయ్య సినిమా కంటే ముందే ప్రేక్షకుల ముందుకు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook